Stock Market Closing 09 May 2023:  


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మధ్యాహ్నం వరకు బాగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక నేల చూపులు చూశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 18,265 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 2 పాయింట్లు తగ్గి 61,761 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలహీనపడి 82.05 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,764 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,879 వద్ద మొదలైంది. 61,654 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,027 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 2 పాయింట్ల నష్టంతో 61,761 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 18,264 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,303 వద్ద ఓపెనైంది. 18,229 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,344 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 2 పాయింట్లు పెరిగి 18,265 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,438 వద్ద మొదలైంది. 43,125 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,533 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 85 పాయింట్లు తగ్గి 43,198 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.61,850గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.27,900 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.