Stock Market Opening 09 May 2023:  


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఈక్విటీ మార్కెట్లో బుల్‌ రన్‌ సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్లు పెరిగి 18,322 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 213 పాయింట్లు పెరిగి 61,977 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,764 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,879 వద్ద మొదలైంది. 61,808 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,007 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 213 పాయింట్ల లాభంతో 61,977 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమారం 18,264 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,303 వద్ద ఓపెనైంది. 18,276 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,338 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 57 పాయింట్లు పెరిగి 18,322 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,౪౩౮ వద్ద మొదలైంది. 42,279 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,493 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 124 పాయింట్లు పెరిగి 43,408 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. కోల్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, హిందుస్థాన్‌ యునీలివర్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫైనాన్స్‌, బ్యాంకు, ఐటీ, మీడియా, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.61,850గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.27,900 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.