Stock Market Opening 10 July 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం పాజిటివ్‌గా మొదలయ్యాయి. వివిధ కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. దాంతో వారు  కొనుగోళ్లు చేపట్టారు.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్లు పెరిగి 19,412 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 196 పాయింట్లు ఎగిసి 65,477 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,280 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,482 వద్ద మొదలైంది. 65,342 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,563 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 196 పాయింట్ల లాభంతో 65,477 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,331 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,400 వద్ద ఓపెనైంది. 19,346 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,416 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 80 పాయింట్లు పెరిగి 19,412 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,958 వద్ద మొదలైంది. 44,885 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,184 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 180 పాయింట్లు ఎగిసి 45,105 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.59,410గా ఉంది. కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.24,180 వద్ద ఉంది. 


Also Read: ఈ వారమే టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో రిజల్ట్స్‌! ట్రేడ్‌ ప్లాన్ చేసుకోండి!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial