Stock Market Opening 10 April 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎకానమీకి స్థిరత్వం లేకపోవడంతో బ్యాంకు షేర్లు సెల్లింగ్ ప్రెజర్‌లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 22 పాయింట్లు పెరిగి 17,618 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 10 పాయింట్లు పెరిగి 59,843 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ షేర్లకు గిరాకీ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,832 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,858 వద్ద మొదలైంది. 59,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,019 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 10 పాయింట్ల లాభంతో 59,843 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,599 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,634 వద్ద ఓపెనైంది. 17,605 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,660 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 22 పాయింట్లు పెరిగి 17,618 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,116 వద్ద మొదలైంది. 40,846 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 140 పాయింట్లు తగ్గి 40,901 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఐటీ, మెటల్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.60,430గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.26,410 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.