Stock Market Opening 05 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్ల లాభంతో 18,045 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 37 పాయింట్ల లాభంతో 60,620 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,657 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,847 వద్ద మొదలైంది. 60,506 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,877 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 37 పాయింట్ల లాభంతో 60,620 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 18,042 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,101 వద్ద ఓపెనైంది. 18,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,045 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్ల లాభంతో 18,045 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 43,073 వద్ద మొదలైంది. 42,730 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,137 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 166 పాయింట్లు తగ్గి 42,792 వద్ద నడుస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. బ్రిటానియా, టాటా కన్జూమర్, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.