Stock Market Closing 02 January 2023: 


భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్‌ సెషన్లో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 92 పాయింట్ల లాభంతో 18,197 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 327 పాయింట్ల లాభంతో 61,167 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక బలహీనపడి 82.74 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,840 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,871 వద్ద మొదలైంది. 60,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,222 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 327 పాయింట్ల లాభంతో 61,167 వద్ద ముగిసింది.


NSE Nifty


శుక్రవారం 18,105 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,191 వద్ద ఓపెనైంది. 18,086 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,215 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 92 పాయింట్ల లాభంతో 18,197 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 43,038 వద్ద మొదలైంది. 42,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,382 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 216 పాయింట్లు పెరిగి 43,203 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 31 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ముగిశాయి. టాటాస్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మీడియా, మెటల్‌, రియాల్టీ సూచీలు ఒకశాతం కన్నా గ్రీన్‌లో మెరిశాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.