search
×

Sensex Today: మరో సపోర్ట్‌ బ్రేక్‌ చేసిన నిఫ్టీ - 19,350 కిందకు సూచీ!

Stock Market @12 PM, 14 August 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా టెక్‌ కంపెనీల పతనం వల్ల అన్ని దేశాల మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market @12 PM, 14 August 2023:

స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా టెక్‌ కంపెనీల పతనం వల్ల అన్ని దేశాల మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. నగదు నిల్వల శాతం పెంచాలని ఆర్బీఐ చెప్పడంతో బ్యాంకింగ రంగ షేర్లు కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 72 పాయింట్లు తగ్గి 19,355 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 196 పాయింట్లు తగ్గి 65,126 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,322 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,153 వద్ద మొదలైంది. 64,821 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,193 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 196 పాయింట్ల నష్టంతో 65,126 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,428 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,383 వద్ద ఓపెనైంది. 19,257 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,392 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 72 పాయింట్లు తగ్గి 19,355 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,066 వద్ద మొదలైంది. 43,776 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,091 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 272 పాయింట్లు తగ్గి 43,926 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, ఇన్ఫీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, రిలయన్స్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లుల లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఎక్కువ పతనం అయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,620 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.3200 తగ్గి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.24,200 వద్ద ఉంది.

Also Read: ఎక్స్‌ నుంచి సంపాదిస్తుంటే GST మోత మామూలుగా ఉండదు!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 14 Aug 2023 12:15 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

టాప్ స్టోరీస్

Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు

Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు

Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు

Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు

New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్

New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్

Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 

Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం