Stock Market Opening Bell 13 July 2022: భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బలహీనంగా ఉండటంతో సూచీలు ఊగిసలాడుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్ల లాభంతో 16,081, బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 74 పాయింట్ల లాభంతో 53,959 వద్ద ట్రేడవుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,886 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 54,210 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 53,909 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 74 పాయింట్ల లాభంతో 53,959 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 16,058 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ బుధవారం 16,128 వద్ద ఓపెనైంది. 16,064 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,140 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 25 పాయింట్ల లాభంతో 16,081 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 35,259 వద్ద మొదలైంది. 35,055 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,308 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 26 పాయింట్ల నష్టంతో 35,105 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టైటాన్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. అన్ని రంగాల సూచీలు ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఒక శాతం మేర పతనమైంది. మెటల్, మీడియా, బ్యాంకు సూచీలు స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.