Stock Market Closing Bell 12 July 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 157 పాయింట్ల నష్టంతో 16,058, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 508 పాయింట్ల నష్టంతో 53,886 వద్ద ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 54,395 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,219 వద్ద నష్టాల్లో మొదలైంది. 53,824 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,236 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 508 పాయింట్ల నష్టంతో 53,886 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 16,216 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,126 వద్ద ఓపెనైంది. 16,031 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,158 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 157 పాయింట్ల నష్టంతో 16,058 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 35,298 వద్ద మొదలైంది. 35,047 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,419 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 337 పాయింట్ల నష్టంతో 35,132 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, శ్రీసెమ్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాపడ్డాయి. ఐచర్ మోటార్స్, హిందాల్కో, ఇన్ఫీ, బీపీసీఎల్, గ్రాసిమ్ షేర్లు నష్టపోయాయి. రియాల్టీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే క్లోజయ్యాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, ఒకశాతానికి పైగా పతనమయ్యాయి.