By: Rama Krishna Paladi | Updated at : 08 Aug 2023 11:05 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 08 August 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. చైనా నేడు ట్రేడ్ బ్యాలెన్స్, రేపు ద్రవ్యోల్బణం డేటాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. గిప్ట్ నిఫ్టీ సైతం ఉదయం నెగెటివ్‌గా ట్రేడవ్వడంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 8 పాయింట్లు తగ్గి 19,588 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 26 పాయింట్లు తగ్గి 65,927 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,953 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 66,048 వద్ద మొదలైంది. 65,855 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,057 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 26 పాయింట్ల నష్టంతో 65,927 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,597 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,627 వద్ద ఓపెనైంది. 19,576 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,634 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 8 పాయింట్లు తగ్గి 19,588 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,052 వద్ద మొదలైంది. 44,817 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,093 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 215 పాయింట్లు పెరిగి 45,052 వద్ద ట్రేడవుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో, సిప్లా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు, విప్రో షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్, హెల్త్‌కేర్ సూచీలు తగ్గాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,060 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,380 వద్ద ఉంది.
Also Read: దేశంలో కోటీశ్వరుల సంఖ్య రెండేళ్లలోనే రెట్టింపు, 4.65 కోట్ల మంది 'జీరో'
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join us LIVE on Instagram today at 11AM to understand "The Power of Compounding" https://t.co/bBxc9KEARw#InvestorAwareness #Compounding #NSE #NSEIndia @ashishchauhan pic.twitter.com/QgfCvQWxNR
— NSE India (@NSEIndia) August 8, 2023
NSE along with SEBI and NSDL conducted an investor awareness session for doctors associated with National Integrated Medical Association (NIMA) at Nashik today.#InvestorAwareness #NSE #SEBI #NIMA @ashishchauhan pic.twitter.com/RTZqdXzfLN
— NSE India (@NSEIndia) August 7, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి