search
×

Stock Market News: స్టాక్‌ మార్కెట్లు విలవిల! సెన్సెక్స్‌ 585, నిఫ్టీ 160 డౌన్‌

Stock Market @ 12 PM on 3 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 160 పాయింట్ల నష్టంతో 16,407, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market @ 12 PM  on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షల్లో మళ్లీ వడ్డీరేట్లు పెంచుతారన్న అంచనా నడుమ సూచీలు సెల్లింగ్‌ ప్రెజర్‌కు గురవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 160 పాయింట్ల నష్టంతో 16,407, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,675 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,373 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,387 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతోంది. ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉంది.

NSE Nifty

సోమవారం 16,569 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,487 వద్ద ఓపెనైంది. 16,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,487 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 160 పాయింట్ల నష్టంతో 16,407 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 35,080 వద్ద మొదలైంది. 34,912 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,154 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 290 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, బీపీఎల్‌ లాభాల్లో ఉన్నాయి. టైటాన్‌, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎల్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ 1 శాతం వరకు పతనమయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 07 Jun 2022 12:45 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం

Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ

Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ

Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?