Stock Market Closing 23 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు, రూపాయి పతనంతో బెంచ్‌మార్క్‌ సూచీలు తీవ్రంగా పతనమయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంటును పెంచాయి. దీనికి తోడు మాంద్యం భయాలు ఆవరించాయి. ఆసియా మార్కెట్లు విలువ ఎక్కువగా ఉండటం, ఐటీ కంపెనీల ఆదాయం, ఇండియా జీడీపీ వృద్ధిరేట్లు, లిక్విడిటీ తగ్గుదల వంటివి ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 302 పాయింట్ల నష్టంతో 17,327 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 80.97 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,119 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,005 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 57,981 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,143 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 17,442 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,593 వద్ద ఓపెనైంది. 17,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,642 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 302 పాయింట్ల నష్టంతో 17,327 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 40,429 వద్ద మొదలైంది. 39,412 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,528 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1084 పాయింట్ల నష్టంతో 39,546 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ముగిశాయి. దివిస్‌ ల్యాబ్‌, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1.5 శాతానికి పైగా నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.