Stock Market Closing Bell 16 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం రక్తమోడాయి! ఉదయం లాభపడ్డ సూచీలు మధ్యాహ్నం నుంచి క్రాష్‌ అయ్యాయి. ద్రవ్యోల్బణం భయాలు ఒకవైపు, అమెరికా, ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను పెంచుతాయన్న వార్తలు మరోవైపు  మదుపర్లను కలవరపెట్టాయి. ఇందుకు క్రూడాయిల్‌ ధరల పెరుగుదల మరింత ఆజ్యం పోసింది. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 331 పాయింట్ల నష్టంతో 15,360, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1045 పాయింట్ల నష్టంతో 51,495 వద్ద ముగిశాయి. రెండు సూచీలు 52 వారాల కనిష్ఠాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్ల మేర నష్టపోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 52,541  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,246 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 51,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1,045 పాయింట్ల నష్టంతో 51,495 వద్ద ముగిసింది. సింగపూర్‌ నిఫ్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఉదయం 500 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకుంది.


Also Read: ఎన్‌పీఎస్‌ కడుతున్నారా! బెనిఫిట్స్‌పై కీలక మార్పులు చేసిన పీఎఫ్ఆర్‌డీఏ!


NSE Nifty


బుధవారం 15,692 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,832 వద్ద ఓపెనైంది. 15,335 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 331 పాయింట్ల నష్టంతో 15,360 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 33,648 వద్ద మొదలైంది. 32,537 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,756 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 721 పాయింట్ల నష్టంతో 32,617 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 2 కంపెనీలు లాభాల్లో 48 నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌ షేర్లు 5-7 శాతం వరకు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు భారీగా పతనం అయ్యాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు 2 శాతానికి పైగా ఎరుపెక్కాయి. 


Also Read: సౌందర్యం కోల్పోయిన రెవ్లాన్‌! దివాలా అంచున అతిపెద్ద కాస్మొటిక్‌ కంపెనీ!