Stock Market Closing 21 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ సమావేశంలో వడ్డీరేట్లు పెంచుతారన్న అంచనాలతో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 97 పాయింట్ల నష్టంతో 17,718 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 262 పాయింట్ల నష్టంతో 59,456 వద్ద ముగిశాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 59,719 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,504 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 59,275 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,799 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 262 పాయింట్ల నష్టంతో 59,456 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 17,816 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,766 వద్ద ఓపెనైంది. 17,663 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,838 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 97 పాయింట్ల నష్టంతో 17,718 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 41,282 వద్ద మొదలైంది. 40,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,501 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 264 పాయింట్ల లాభంతో 41,203 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐటీసీ, అపోలో హాస్పిటల్స్‌, బజాజ్ ఫైనాన్స్‌ లాభపడ్డాయి. శ్రీసెమ్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలన్నీ పతనమయ్యాయి. మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఒక శాతానికి పైగా ఎరుపెక్కాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.