Mutual Funds: ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు (YTD), ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు హై ఓలటాలిటీ మధ్య ట్రేడ్‌ అయ్యాయి. భారీ అస్థిరత ఉన్నా, ఈ 9 నెలల కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 TRI (Total Return Index) సుమారు 3 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 TRI దాదాపు 4.5 శాతం రాబడిని అందించి పాజిటివ్ జోన్‌లో కొనసాగింది.


నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 TRI మాత్రం ముంచేసింది. స్మాల్‌ ఇన్వెస్టర్లతో పాటు మ్యూచువల్‌ ఫండ్ (MFs) మేనేజర్లకూ చుక్కలు చూపింది. ఇది నెగెటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చినప్పటికీ, ఈ కరెక్షన్‌ను బాటమ్ ఫిషింగ్‌కు (అత్యంత కనిష్ట ధర దగ్గర కొనుగోలు చేయడం) మంచి అవకాశంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ భావించాయి, భారీగా కొనుగోళ్లు చేపట్టాయి. దీంతో, గత మూడు నెలల్లో (జూన్-ఆగస్టు) 25 స్మాల్‌క్యాప్స్‌ మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ ఈ షేర్లలో కొనుగోళ్లను ఏనెలకు ఆ నెల పెంచుకుంటూ వెళ్తున్నాయి.


తక్కువలో తక్కువగా, కనీసం 25 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లు ఇటీవలి నెలల్లో కొనుగోలు చేసిన ఆరు స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ ఇక్కడ ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు చూస్తే, ఈ ఆరు కౌంటర్లు 13-40 శాతం మధ్య నష్టపోయాయి. దీనిని అవకాశంగా మార్చుకున్న మ్యూచువల్‌ ఫండ్స్‌, వాటిని కొనడం (బాటమ్ ఫిషింగ్‌) మొదలు పెట్టాయి. దీంతో జూన్‌ నుంచి ఇవి లాభాల్లోకి మళ్లాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు నువోకో విస్టాస్ కార్పొరేషన్, అజంతా ఫార్మా షేర్లు వరుసగా 48 శాతం, 11 శాతం లాభపడ్డాయి. 


మ్యూచువల్‌ ఫండ్స్‌ బాటమ్‌ ఫిషింగ్‌ చేసిన ఆ ఆరు షేర్లు ఇవి:


గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌ - Gujarat State Petronet
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 53 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 13.80 శాతం పడిపోయింది.


అజంతా ఫార్మా - Ajanta Pharma
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 44 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 23.46 శాతం పడిపోయింది.


సనోఫి ఇండియా - Sanofi India
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 43 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 13.34 శాతం పడిపోయింది.


నాట్కో ఫార్మా - Natco Pharma
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 37 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 23.45 శాతం పడిపోయింది.


జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ - GR Infraprojects
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 32 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 18.30 శాతం పడిపోయింది.


నువోకో విస్టాస్‌ కార్పొరేషన్‌ - Nuvoco Vistas Corporation
ఆగస్టు నెలలో ఈ స్టాక్‌ను మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు 31 హోల్డ్‌ చేశాయి. 
ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య కాలంలో ఈ స్టాక్‌ 39.64 శాతం పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.