Stock Market Closing 07 August 2023:


భారత స్టాక్‌ మార్కెట్లో సోమవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ దెబ్బ నుంచి సూచీలు త్వరగానే కోలుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడడంతో ఇన్వెస్టర్లు షేర్లను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 80 పాయింట్లు పెరిగి 19,597 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 232 పాయింట్లు పెరిగి 65,953 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి  82.72 వద్ద ముగిసింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,721 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,811 వద్ద మొదలైంది. 65,748 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,067 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 232 పాయింట్ల లాభంతో 65,953 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,517 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,576 వద్ద ఓపెనైంది. 19,524 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,620 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 80 పాయింట్లు పెరిగి 19,597 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,993 వద్ద మొదలైంది. 44,773 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 42 పాయింట్లు పెరిగి 44,837 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, దివిస్‌ ల్యాబ్‌, ఎల్‌టీఐ, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. బ్రిటానియా, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, మీడియా, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పుంజుకున్నాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.24,540 వద్ద ఉంది.


Also Read: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా, అది పూర్తయితేనే టాక్స్‌ బెనిఫిట్స్‌ వర్తిస్తాయని తెలుసా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.