Stock Market Closing Bell 02 August 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో సూచీలు ఫ్లాట్‌గా కదలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల లాభంతో 17,345 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 20 పాయింట్ల లాభంతో 58,136 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు లాభపడి 78.71 వద్ద క్లోజైంది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,115 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,049 వద్ద మొదలైంది. 57,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,328 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 20 పాయింట్ల లాభంతో 58,136 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,340 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,310 వద్ద ఓపెనైంది. 17,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,390 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్ల లాభంతో 17,345 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,767 వద్ద మొదలైంది. 37,632 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,179 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 120 పాయింట్ల లాభంతో 38,024 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్ యునీలివర్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, హీరో మోటాకార్ప్, ఎస్‌బీఐ లైఫ్, బ్రిటానియా, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, మెటల్, మీడియా షేర్లలో అమ్మకాలు కనిపించాయి.