Stock Market Closing Bell 01 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభపడ్డాయి. ఈ వారం తొలిరోజే భారీగా ఎగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 181 పాయింట్ల లాభంతో 17,340 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 545 పాయింట్ల లాభంతో 58,115 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు లాభపడి 79.02 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,570 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,823 వద్ద మొదలైంది. 57,540 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,170 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 545 పాయింట్ల లాభంతో 58,115 వద్ద ముగిసింది.


NSE Nifty


శుక్రవారం 17,243 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,243 వద్ద ఓపెనైంది. 17,154 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,356 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 181 పాయింట్ల లాభంతో 17,340 వద్ద క్లోజైంది.



Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,594 వద్ద మొదలైంది. 37,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,939 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 411 పాయింట్ల లాభంతో 37,903 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, దివిస్‌ ల్యాబ్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఫార్మా మినహా మిగతా రంగాల సూచీలన్నీ ఎగిశాయి. బ్యాంకు, ఆటో, మీడియా, మెటల్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఒక శాతం కన్నా ఎక్కువే లాభపడ్డాయి.