By: Rama Krishna Paladi | Updated at : 30 Aug 2023 03:50 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Closing 30 August 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో మొదలైన సూచీలు.. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే తుస్సుమన్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 4 పాయింట్లు పెరిగి 19,347 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 11 పాయింట్లు పెరిగి 65,087 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.73 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,075 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,311 వద్ద మొదలైంది. 65,052 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,458 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 11 పాయింట్ల లాభంతో 65,087 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,342 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,433 వద్ద ఓపెనైంది. 19,334 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,452 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 4 పాయింట్లు ఎగిసి 19,347 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,706 వద్ద మొదలైంది. 44,149 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,779 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 262 పాయింట్ల నష్టంతో 44,232 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్, టాటా స్టీల్, మారుతీ, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హీరో మోటో, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.77,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.25,870 వద్ద ఉంది.
Also Read: ఈ రాఖీ పండుగ రోజున మీ సోదరికి ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి, ఈ 5 ఆప్షన్స్ బాగుంటాయి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం