By: ABP Desam | Updated at : 30 Aug 2022 03:57 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Closing Bell 30 August 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. తొలి త్రైమాసికంలో జీడీపీ పెరుగుదల, ఆర్థికాభివృద్ధి, ఆటో స్టాక్స్ జోరుమీద ఉండటం, ఐరోపాలో పరిస్థితులు మెరుగవుతున్నాయన్న సూచనలతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 446 పాయింట్ల లాభంతో 17,759 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1564 పాయింట్ల లాభంతో 59,537 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు పెరిగింది.
BSE Sensex
క్రితం సెషన్లో 57,972 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,259 వద్ద మొదలైంది. 58,245 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,599 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1564 పాయింట్ల లాభంతో 59,537 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,312వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,414 వద్ద ఓపెనైంది. 17,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,777 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 446 పాయింట్ల లాభంతో 17,759 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 38,516 వద్ద మొదలైంది. 38,472 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,606 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1206 పాయింట్ల లాభంతో 39,536 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 50 కంపెనీలు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్స్, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2-3.5 శాతం వరకు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
Hathya Review - హత్య రివ్యూ: వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై మరో సినిమా... జగన్, అవినాష్, సునీత - ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరు?
Bharat Ratna Award List 2025: ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? ఇంకా లిస్ట్‌లో ఎవరెవరున్నారు?