Stock Market Closing 29 November 2022:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం గరిష్ఠ స్థాయిల్లో ట్రేడ్ అయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందాయి. ఎకానమీ మెరుగ్గా ఉండటంతో సూచీలు ఆల్‌టైమ్ హై దిశగా సాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్ల లాభంతో 18,618 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 177 పాయింట్ల లాభంతో 62,681 వద్ద ముగిశాయి. సాయంత్రం మదుపర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో సూచీలు కాస్త తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసల బలహీనపడి 81.72 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 62,504 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,362 వద్ద మొదలైంది. 62,362 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 177 పాయింట్ల లాభంతో 62,681 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 18,562 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,649 వద్ద ఓపెనైంది. 18,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 55.30 పాయింట్ల లాభంతో 18,618 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా లాభపడింది. ఉదయం 42,959 వద్ద మొదలైంది. 42,959 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,279 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 33 పాయింట్ల లాభంతో 43,053 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యునీలివర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సిప్లా, హీరోమోటో కార్ప్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐచర్ మోటార్స్, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. ఆటో, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.