Stock Market closing 29 August 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే వచ్చాయి. అయితే లార్జ్ క్యాప్ షేర్లలో మూమెంటమ్ లేకపోవడంతో సూచీలు పెరగడం లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్లు పెరిగి 19,342 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 79 పాయింట్లు పెరిగి 65,075 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.70 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 64,996 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,201 వద్ద మొదలైంది. 64,956 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,229 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 79 పాయింట్ల లాభంతో 65,075 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,306 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,374 వద్ద ఓపెనైంది. 19,309 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,377 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 36 పాయింట్లు ఎగిసి 19,342 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఉదయం 44,655 వద్ద మొదలైంది. 44,429 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,673 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం ఒక పాయింటు లాభంతో 44,495 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్స్, యూపీఎల్, హిందాల్కో, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, హిందుస్థాన్ యునీలివర్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేటు, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.590 పెరిగి రూ.25,670 వద్ద ఉంది.
Also Read: హైబ్రీడ్ అందరికీ బెస్ట్! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.