Stock Market Closing 28 August 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. మరోసారి కరెక్షన్ గురవ్వడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు దన్నుతో మళ్లీ ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 40 పాయింట్లు పెరిగి 19,306 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 110 పాయింట్లు పెరిగి 65,996 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.62 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,886 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 64,908 వద్ద మొదలైంది. 64,776 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,213 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 110 పాయింట్ల లాభంతో 64,996 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,265 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,298 వద్ద ఓపెనైంది. 19,249 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,366 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 40 పాయింట్లు ఎగిసి 19,306 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ బాగా పెరిగింది. ఉదయం 44,253 వద్ద మొదలైంది. 44,201 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,610 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 263 పాయింట్లు పెరిగి 44,494 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 19 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, ఎల్‌టీ, సిప్లా, ఎం అండ్ ఎం, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్, రిలయన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, నెస్లే ఇండియా నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయి్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.76,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.25,080 వద్ద ఉంది.
Also Read: ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.