Stock Market Closing 27 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో భారీగా పతనమయ్యాయి. హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ కంపెనీల షేర్లు రక్తమోడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 287 పాయింట్ల నష్టంతో 17,604 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 874 పాయింట్ల నష్టంతో 59,330 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు విపరీతంగా పతనమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 81.52 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,205 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,166 వద్ద మొదలైంది. 58,974 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,166 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 874 పాయింట్ల నష్టంతో 59,330 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,891 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,877 వద్ద ఓపెనైంది. 17,493 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,884 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టంతో 17,604 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 41,382 వద్ద మొదలైంది. 40,148 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,417 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 1302 పాయింట్లు తగ్గి 40,343 వద్ద ఆగిపోయింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, సిప్లా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు లాభపడ్డాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు రక్తమోడాయి.
BSEలోని మొత్తం లిస్టెడ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ ( capitalisation) రూ. 2,68,344 లక్షల కోట్లకు పడిపోయింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఒక్క పూటలో రూ. 8.1 లక్షల కోట్ల మేర కోల్పోయారు.
నిఫ్టీ బ్యాంక్ 1,300 పాయింట్లు లేదా 3.3% పైగా నష్టపోవడంతో బ్యాంక్ స్టాక్స్ ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గత కొన్ని నెలలుగా ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్న PSU బ్యాంక్ స్టాక్స్ అత్యంత దారుణంగా నష్టపోయాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లేదా FIIలు ఈ నెలలో అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. జనవరిలో ఇప్పటివరకు ఈక్విటీల అమ్మకం మొత్తం రూ. 16,766 కోట్లకు చేరింది. గత బుధవారం ఒక్కరోజే ఎఫ్‌ఐఐ అమ్మకాలు రూ. 2,394 కోట్లకు చేరుకున్నాయి. భారత్ నుంచి వెనక్కు తీసుకుంటున్న నిధులను చైనా వంటి చౌక మార్కెట్‌లకు మళ్లిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.