Stock Market Closing 25 April 2023:  


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. పవర్‌, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు పెరిగాయి. ఆ షేర్ల కోసం మదుపర్లు ఎగబడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్లు పెరిగి 17,769 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 74 పాయింట్లు పెరిగి 60,130 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.93 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,056 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,202 వద్ద మొదలైంది. 59,967 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,268 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 74 పాయింట్ల లాభంతో 60,130 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 17,743 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,761 వద్ద ఓపెనైంది. 17,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,807 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 25 పాయింట్లు పెరిగి 17,769 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,731 వద్ద మొదలైంది. 42,601 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 42 పాయింట్లు పెరిగి 42,678 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్డీఎఫ్‌సీ టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.430 తగ్గి రూ.28,600 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.