Stock Market Closing 24 April 2023:  


స్టాక్‌ మార్కెట్లు సోమవారం రివ్వున ఎగిశాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అయితే ప్రైవేటు బ్యాంకుల మెరుగైన ఫలితాలు విడుదల చేయడంతో మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 119 పాయింట్లు పెరిగి 17,743 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 401 పాయింట్లు పెరిగి 60,056 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.100 వద్ద స్థిరపడింది.




BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,655 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,873 వద్ద మొదలైంది. 59,620 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,101 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 401 పాయింట్ల లాభంతో 60,056 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 17,624 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,707 వద్ద ఓపెనైంది. 17,612 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,754 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 119 పాయింట్లు పెరిగి 17,743 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,469 వద్ద మొదలైంది. 42,269 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,714 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 517 పాయింట్లు పెరిగి 42,635 వద్ద స్థిరపడింది.




Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టాటా కన్జూమర్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ ఇండ్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, మారుతీ షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్‌ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.60,710గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.76,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.620 తగ్గి రూ.29,030 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.