search
×

Stock Market News: 19,800 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్సీ - 300 పాయింట్లు పడ్డ సెన్సెక్స్‌!

Stock Market Closing 24 July 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 24 July 2023:

స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం నుంచీ ఊగిసలాడిన సూచీలు ఆఖర్లో పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 72 పాయింట్లు తగ్గి 19,672 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 299 పాయింట్లు పతనమై 66,384 వద్ద ముగిశాయి. బేర్స్‌ మార్కెట్లపై పట్టు బిగిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,584 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,629 వద్ద మొదలైంది. 66,326 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,808 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 299 పాయింట్ల నష్టంతో 66,384 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

శుక్రవారం 19,745 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,748 వద్ద ఓపెనైంది. 19,658 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,782 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 72 పాయింట్లు పతనమై 19,672 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 46,131 వద్ద మొదలైంది. 45,858 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,191 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 152 పాయింట్లు తగ్గి 45,923 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ ఇండ్‌, ఎస్బీఐ లైఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎం అండ్‌ ఎం, అల్ట్రాటెక్‌ సెమ్‌ షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, కొటక్‌ బ్యాంకు, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.25,340 వద్ద ఉంది.

Also Read: ఈపీఎఫ్‌ వడ్డీరేటు డిక్లేర్‌! FY 2022-23కి ఎంత చెల్లిస్తున్నారంటే?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Jul 2023 03:58 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !

Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !

Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!

Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!

Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్

Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్