Stock Market Closing, 23 May 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. వరుసగా మూడో రోజు అదానీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో సాయంత్రం సూచీలు తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లు పెరిగి 18,348 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 18 పాయింట్లు పెరిగి 61,981 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసల బలపడి 82.79 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,963 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,098 వద్ద మొదలైంది. 61,914 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,245 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 పాయింట్ల లాభంతో 61,981 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 18,314 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,362 వద్ద ఓపెనైంది. 18,324 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,419 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 33 పాయింట్లు పెరిగి 18,348 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,978 వద్ద మొదలైంది. 43,852 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 69 పాయింట్లు పెరిగి 43,954 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 27  కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్ ల్యాబ్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఐచర్‌ మోటార్స్‌, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని రంగాలు ఎగిశాయి. ఆటో,మీడియా, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఎక్కువ లాభపడ్డాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.61,100గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.28,450 వద్ద కొనసాగుతోంది.


Also Read: అప్పుడు మట్టి కరిపించాయి, ఇప్పుడు మల్టీబ్యాగర్స్‌గా మారాయి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.