search
×

Stock Market News: ఫెడ్‌ ప్రకటన కోసం వెయిటింగ్‌ - అప్రమత్తంగా కదలాడిన నిఫ్టీ, సెన్సెక్స్‌!

Stock Market Closing 23 March 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రకటన కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Stock Market Closing 23 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రకటన కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 44 పాయింట్లు పెరిగి 17,151 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 139 పాయింట్లు ఎగిసి 58,214 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి  82.65 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 58,074 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,245 వద్ద మొదలైంది. 58,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,418 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 139 పాయింట్ల లాభంతో 58,214 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 17,107 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,177 వద్ద ఓపెనైంది. 17,107 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,207 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 44 పాయింట్లు ఎగిసి 17,151 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,036 వద్ద మొదలైంది. 39,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,085 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 104 పాయింట్లు పెరిగి 39,999 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్ ఫార్మా, టాటా కన్జూమర్‌ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్‌ సూచీలు భారీగా పెరిగాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.870 తగ్గి రూ.59,130 గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.71,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.25,820 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 22 Mar 2023 03:57 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Stock Market News: స్టాక్‌ మార్కెట్లో లక్ష్మీ కళ! నేడు రూ.3 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Stock Market News: సెన్సెక్స్‌కు రిలయన్స్‌ బూస్ట్‌! 62,000 పైన ట్రేడింగ్‌!

Stock Market News: సెన్సెక్స్‌కు రిలయన్స్‌ బూస్ట్‌! 62,000 పైన ట్రేడింగ్‌!

Stock Market News: పాజిటివ్‌ నోట్‌లో క్లోజైన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియాల్టీ ర్యాలీ!

Stock Market News: పాజిటివ్‌ నోట్‌లో క్లోజైన సెన్సెక్స్‌, నిఫ్టీ - ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియాల్టీ ర్యాలీ!

Aadhar: ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేయవచ్చు

Aadhar: ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేయవచ్చు

Stock Market News: గ్లోబల్‌ వీక్‌నెస్‌ - రెడ్‌ జోన్లో ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market News: గ్లోబల్‌ వీక్‌నెస్‌ - రెడ్‌ జోన్లో ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!