Stock Market Closing 23 January 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల లాభంతో 18,188 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 319 పాయింట్ల లాభంతో 60,941 వద్ద ముగిశాయి.  డాలర్‌తో పోలిస్తే రూపాయి 42 పైసలు బలహీనపడి 81.40 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,621 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,876 వద్ద మొదలైంది. 60,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 319 పాయింట్ల లాభంతో 60,941 వద్ద ముగిసింది.


Also Read: Q3 నంబర్లతో మార్కెట్‌ను ఆదుకున్న బ్యాంకులు, ఇవి లేకపోతే అంతా అస్సామే


NSE Nifty


శుక్రవారం 18,027 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,118 వద్ద ఓపెనైంది. 18,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 90 పాయింట్ల లాభంతో 18,188 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది. ఉదయం 42,891 వద్ద మొదలైంది. 42,727 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,005 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 314 పాయింట్లు పెరిగి 42,821 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టపోయాయి. సన్‌ ఫార్మా, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐచర్‌ మోటార్స్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌, గ్రాసిమ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, జేఎస్‌ డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. మెటల్‌, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు ఎగిశాయి.


Also Read: 'T+1' సెటిల్‌మెంట్‌కు స్టాక్స్‌ మారే టైమ్‌ వచ్చింది, ఈ గురువారమే తుది గడువు


Also Read: చిన్న క్రిప్టోలు జోష్‌ - రూ.5000 తగ్గిన బిట్‌ కాయిన్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.