Stock Market Opening 23 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయమే సూచీలు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 125 పాయింట్ల లాభంతో 18,135 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 468 పాయింట్ల లాభంతో 61,090 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,621 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,876 వద్ద మొదలైంది. 60,761 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 468 పాయింట్ల లాభంతో 61,090 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
శుక్రవారం 18,027 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,118 వద్ద ఓపెనైంది. 18,063 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 125 పాయింట్ల లాభంతో 18,153 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 42,891 వద్ద మొదలైంది. 42,745 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,005 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 458 పాయింట్లు పెరిగి 42,964 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్, హీరోమోటో కార్ప్, ఎం అండ్ ఎం, యూపీఎల్, కొటక్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సెమ్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు నష్టపోయాయి. మెటల్, రియాల్టీ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం 2022 డిసెంబర్ త్రైమాసికంలో 15% తగ్గి రూ. 15,792 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ఆదాయం 15% పెరిగి రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకుంది. నికర లాభం అంచనాల కంటే తక్కువగా ఉంది. వినియోగదారు వ్యాపారాల్లో వృద్ధి కారణంగా, ఆయిల్-టు-కెమికల్స్ (O2C) సెగ్మెంట్‌లో బలహీనమైన పని తీరు భర్తీ అయింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్ర బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం 31% పెరిగి రూ. 2,792 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాది ప్రాతిపదికన 30% పెరిగి రూ. 5,653 కోట్లకు చేరుకుంది. మూడో త్రైమాసికంలో దాని నికర వడ్డీ మార్జిన్ (NIM) 5.47%కి మెరుగుపడింది.
ICICI బ్యాంక్: డిసెంబర్ త్రైమాసికంలో ICICI బ్యాంక్ PATలో సంవత్సరానికి (YoY) 34% వృద్ధిని నమోదు చేసి రూ. 8,312 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాది ప్రాతిపదికన 35% పెరిగి Q3లో రూ. 16,465 కోట్లకు చేరుకుంది.
యెస్ బ్యాంక్: డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో యెస్ బ్యాంక్ నికర లాభం రూ. 51 కోట్లకు పడిపోయింది. అధిక కేటాయింపులు (Provisions) దెబ్బ కొట్టాయి. ఈ త్రైమాసికంలో కేటాయింపులు QoQలో 45% పెరిగి రూ. 845 కోట్లకు చేరుకున్నాయి. మూడవ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 12% పెరిగి రూ. 1,971 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.