Stock Market Closing 23 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. కొవిడ్ భయంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 320 పాయింట్ల నష్టంతో 17,806 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 980 పాయింట్ల నష్టంతో 59,845 వద్ద క్లోజయ్యాయి. ఇన్వెస్టర్లు నేడు రూ.5.50 లక్షల కోట్ల వరకు నష్టపోయారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీనపడి 82.86 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,826 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,205 వద్ద మొదలైంది. 59,765 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,546 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 980 పాయింట్ల నష్టంతో 59,845 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 18,127 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,977 వద్ద ఓపెనైంది. 17,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 320 పాయింట్ల నష్టంతో 17,806 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 41,951 వద్ద మొదలైంది. 41,597 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,226 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 740 పాయింట్లు పతనమై 41,668 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 3 కంపెనీలు లాభాల్లో 47 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, దివిస్ ల్యాబ్, టైటాన్ లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.