Stock Market Closing 23 December 2022:


భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి.  ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. కొవిడ్ భయంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 17,940 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 633 పాయింట్ల నష్టంతో 60,193 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు గంటలోనే రూ.3.50 లక్షల కోట్ల వరకు నష్టపోయారు.


BSE Sensex


క్రితం సెషన్లో 60,826 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,205 వద్ద మొదలైంది. 60,205 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,546 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 633 పాయింట్ల నష్టంతో 60,193 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 18,127 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,977 వద్ద ఓపెనైంది. 17,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 187 పాయింట్ల నష్టంతో 17,940 వద్ద చలిస్తోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ఉంది. ఉదయం 41,951 వద్ద మొదలైంది. 41,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,226 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 507 పాయింట్లు పతనమై 41,901 వద్ద ఉంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నష్టపోయాయి. ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌, మీడియా, ఆటో ఎక్కువ ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.