Stock Market Closing 23 August 2023:


స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీల అండతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 47 పాయింట్లు పెరిగి 19,444 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 213 పాయింట్లు పెరిగి 65,433 వద్ద ముగిశాయి. నిఫ్టీ కీలకమైన సపోర్ట్‌ లెవల్‌ను కాపాడుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు లాభపడి 82.68 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,220 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,300 వద్ద మొదలైంది. 65,108 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,504 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 213 పాయింట్ల లాభంతో 65,433 వద్ద ముగిసింది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 19,396 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,439 వద్ద ఓపెనైంది. 19,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,472 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 47 పాయింట్లు పెరిగి 19,444 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ ఎగిసింది.  ఉదయం 44,064 వద్ద మొదలైంది. 43,952 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,521 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 485 పాయింట్లు పెరిగి 44,479 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు, దివిస్‌ ల్యాబ్, ఎల్‌టీ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జియో ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ ఫార్మా, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.75,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.120 తగ్గి రూ.24,640 వద్ద ఉంది.


Also Read: ఉద్యోగులకు ఇన్ఫీ గుడ్‌న్యూస్‌! 80% వేరియబుల్‌ పే ఇచ్చేస్తున్న ఐటీ దిగ్గజం


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.