search
×

Stock Market News: ఫైనాన్స్‌ షేర్లు కుమ్మేశాయ్‌ - సెన్సెక్స్‌ 445, నిఫ్టీ 119 పెరిగేశాయ్‌!

Stock Market Closing 21 March 2023: వరుస నష్టాలకు తెరపడింది. మంగళవారం స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 21 March 2023: 

వరుస నష్టాలకు తెరపడింది. మంగళవారం స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. బ్యాంకింగ్‌ సంక్షోభం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 119 పాయింట్లు పెరిగి 17,107 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 445 పాయింట్లు ఎగిసి 58,074 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 82.66 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 57,628 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,963 వద్ద మొదలైంది. 57,730 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,133 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 445 పాయింట్ల లాభంతో 58,074 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 17,005 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,060 వద్ద ఓపెనైంది. 17,016 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,127 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 119 పాయింట్లు తగ్గి 17,107 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 39,599 వద్ద మొదలైంది. 39,366 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,970 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 532 పాయింట్లు పెరిగి 39,894 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, రిలయన్స్‌, బజాజ్ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, మెటల్‌, బ్యాంకు, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సూచీలు లాభపడ్డాయి. 

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.60,000 గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.72,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.370 పెరిగి రూ.26,160 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 21 Mar 2023 04:09 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

సంబంధిత కథనాలు

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మూడేళ్లలో 65% రిటర్న్‌

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: 18,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - ఆటో, రియాల్టీ, మెటల్స్‌ బూమ్‌!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - హీరో మోటో దూకుడు!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

Stock Market: లైఫ్‌ టైమ్‌ హై ముందు మార్కెట్లో వొలటిలిటీ - సెన్సెక్స్‌ 327 పాయింట్లు డౌన్‌!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్