Stock Market Closing 21 August 2023:


స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా కొవిడ్‌ లాక్‌డౌన్‌లో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. ఎకానమీ పుంజుకుంటోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 83 పాయింట్లు పెరిగి 19,393 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 267 పాయింట్లు పెరిగి 65,216 వద్ద ముగిశాయి. నేడు ఐటీ, ఫార్మా సూచీలు ఎక్కువ పెరిగాయి. అదానీ షేర్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 64,948 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 64,852 వద్ద మొదలైంది. 64,852 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,335 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 267 పాయింట్ల లాభంతో 65,216 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 19,310 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,320 వద్ద ఓపెనైంది. 19,296 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,425 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 83 పాయింట్లు పెరిగి 19,393 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,952 వద్ద మొదలైంది. 43,862 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 150 పాయింట్లు పెరిగి 44,002 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. జియో ఫైనాన్స్‌, రిలయన్స్‌, ఎం అండ్‌ ఎం, బ్రిటానియా, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంకు మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. ఐటీ, మెటల్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు కళకళలాడాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.59,070 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.73,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.


Also Read: తుస్సుమన్న జియో ఫైనాన్షియల్ షేర్లు, లిస్టింగ్‌ తర్వాత లోయర్‌ సర్క్యూట్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.