Jio Financial Services Listing: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న చేయబడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఈ రోజు (21 ఆగస్టు 2023) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక్కో షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో రూ. 265 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో రూ. 262 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి, దలాల్ స్ట్రీట్‌లో జర్నీ స్టార్ట్ చేశాయి.
స్టాక్ మార్కెట్ ప్రారంభానికి ముందు, BSEలో, JSFL స్టాక్ రూ. 265 సెటిలైంది. NSEలో రూ. 262 దగ్గర స్థిరపడింది.
తుస్సుమన్న జియో ఫైనాన్షియల్ షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జర్ తర్వాత, ఈ ఏడాది జులై 20న నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో ప్రత్యేక సెషన్‌లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ధరను రూ. 261.85గా (డిస్కవర్ ప్రైస్) తేల్చారు. ఈ రోజు JSFL షేర్లు అదే ప్రైస్ దగ్గర, ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. వాస్తవానికి, ఈ కంపెనీ షేర్ హోల్డర్లు ఈ రోజు కోసం చాలా ఆతృతగా ఎదురు చూశారు, లిస్టింగ్ గెయిన్స్ ఆశించారు. కానీ GMP ప్రకారం, జియో ఫైనాన్షియల్ షేర్లు పెద్దగా లాభపడలేదు. పైగా, ఓపెనింగ్ ట్రేడింగ్‌లో డిస్కవర్ ప్రైస్ ₹261.85 కంటే తక్కువకే ఈ షేర్లను పెట్టుబడిదార్లు కొనగలిగారు.
JSFL షేర్లు ఓపెనింగ్ ట్రేడ్‌లో 5 శాతం క్షీణించి, లోయర్ సర్క్యూట్‌లోకి వెళ్లాయి. NSEలో, JIO FIN ఒక్కో షేరు ధరకు రూ. 249.05కు దిగి వచ్చింది. అంటే, ఒక్కో షేర్ ప్రైస్ రూ. 12.95 లేదా 4.94 శాతం పడిపోయింది. BSEలో రూ. 251.75 వద్ద ఉంది. ఈ ఎక్సేంజ్‌లో ఒక్కో షేర్ రూ. 13.25 లేదా 5 శాతం క్షీణతను చూస్తోంది.
BSEలో షేర్ల ఓపెనింగ్ ప్రైస్ ₹251.75 ప్రకారం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ విలువ ₹1,59,943 కోట్లుగా ఉంది. NSEలో ప్రస్తుత షేరు ధర ₹248.90 వద్ద మార్కెట్ క్యాప్ ₹1,58,133 కోట్లుగా ఉంది.
మరో 10 రోజుల పాటు 'నో ఇంట్రాడే ట్రేడ్'
అర్హత గల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను 1:1 నిష్పత్తిలో కేటాయించారు. ప్రస్తుతం, JSFL షేర్లు ట్రేడ్-టు-ట్రేడ్ సెగ్మెంట్‌లో 10 రోజుల పాటు ట్రేడ్ అవుతాయి. అంటే, ఈ షేర్లను డెలివరీ ప్రాతిపదికన మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. ఈ 10 ట్రేడింగ్ రోజుల్లో ఈ కంపెనీ షేర్లలో ఇంట్రా డే ట్రేడ్ ఉండదు.
మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు ఊగిసలాట - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial