By: ABP Desam | Updated at : 18 May 2023 03:49 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixel )
Stock Market Closing 18 May 2023:
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం లాభాల్లోనే మొదలైనా.. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే మదుపర్లు అమ్మకాలు మొదలు పెట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 51 పాయింట్లు తగ్గి 18,129 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 128 పాయింట్లు తగ్గి 61,431 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు బలహీనపడి 82.59 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,560 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,937 వద్ద మొదలైంది. 61,349 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,955 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 128 పాయింట్ల నష్టంతో 61,431 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 18,181 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,287 వద్ద ఓపెనైంది. 18,104 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,297 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 51 పాయింట్లు పెరిగి 18,129 వద్ద ట్రేడవుతుంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,006 వద్ద మొదలైంది. 43,673 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,079 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 53 పాయింట్లు ఎగిసి 43,752 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ నష్టపోయాయి. ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.61,200గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.28,300 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Senior delegates from MSCI visited NSE HO today. Mr. Baer Pettit - President & COO, Mr. Jigar Thakkar - CTO & Head of Engineering, Mr. Rajeev Mohta - ED, Head of India Client Coverage, rang the #NSEBell along with our MD & CEO, Shri @AshishChauhan and other senior NSE officials.… pic.twitter.com/dFopMy3ElZ
— NSE India (@NSEIndia) May 18, 2023
Hon'ble Consul General of Ireland, Ms. Anita Kelly rang the #NSEBell along with our MD & CEO, Shri @AshishChauhan, during her visit to NSE HO, today. #NSEIndia #BellRinging #VisittoNSE pic.twitter.com/xxlyx9zGxj
— NSE India (@NSEIndia) May 18, 2023
Don't fall for schemes or messages that claim to give you assured/guaranteed returns in stock market! Please report at Feedbk_invg@nse.co.in or call us at 1800 266 0050 whenever you come across such messages.#NSE #AssuredReturns #StockMarket #InvestorAwareness @ashishchauhan
— NSE India (@NSEIndia) May 18, 2023
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Janasena: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు - గాజు గ్లాసు గుర్తు రిజర్వ్
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
APPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలు ప్రకటించిన ఏపీపీఎస్సీ - ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Janasena: 'నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం అంశం' - జనసేన కేంద్ర కార్యాలయం కీలక ఆదేశాలు