search
×

Sensex Today: నష్టమెక్కువ.. రికవరీ తక్కువ! 19,300 వద్ద నిఫ్టీ క్లోజింగ్‌ - 202 పాయింట్లు పడ్డ సెన్సెక్స్‌

Stock Market: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. చైనాలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దివాలా తీయడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 18 August 2023:

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. చైనాలో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దివాలా తీయడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఐటీ షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 55 పాయింట్లు తగ్గి 19,310 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 202 పాయింట్లు తగ్గి 64,948 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 83.10 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,151 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,025 వద్ద మొదలైంది. 64,754 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,175 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 202 పాయింట్ల నష్టంతో 64,948 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,365 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,301 వద్ద ఓపెనైంది. 19,253 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,373 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 55 పాయింట్లు నష్టపోయి 19,310 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,724 వద్ద మొదలైంది. 43,672 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,724 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 40 పాయింట్లు తగ్గి 43,851 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఐచర్‌ మోటార్స్‌, మారుతీ, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. హీరో మోటో, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హిందాల్కో, ఇన్ఫీ షేర్లు నష్టపోయాయి.  ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు పెరిగాయి. ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రూ.59,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 పెరిగి రూ.73500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.23,970 వద్ద ఉంది.

Also Read: అన్ని బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ను ఒకేచోట చూడొచ్చు, కొత్త పోర్టల్‌ ప్రారంభం

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 18 Aug 2023 03:58 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

టాప్ స్టోరీస్

Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి

Andhra Pradesh And Telangana Latest News: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం-  పదే పదే సీఎంలు ‌అసంతృప్తి

Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు

Smriti 50 In 27 Balls: స్మృతి సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 27 బంతుల్లో ఫిఫ్టీ.. ఆర్సీబీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఢిల్లీ చిత్తు

BJP Congress Game: అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?

BJP Congress Game:  అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?

Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?

Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?