By: ABP Desam | Updated at : 14 Mar 2023 04:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 14 March 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా బ్యాంకులు దివాలా తీయడం, అక్కడి స్టాక్ మార్కెట్లు పతనమవ్వడం మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు కారణం అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 111 పాయింట్లు తగ్గి 17,043 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 337 పాయింట్లు పతనమై 57,900 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 బలహీనపడి 82.49 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,237 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,168 వద్ద మొదలైంది. 57,721 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,490 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 337 పాయింట్ల నష్టంతో 57,900 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,154 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,160 వద్ద ఓపెనైంది. 16,987 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,224 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 111 పాయింట్లు పతనమై 17,043 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ బాగా నష్టపోయింది. ఉదయం 39,522 వద్ద మొదలైంది. 39,132 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,768 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 153 పాయింట్లు తగ్గి 39,411 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. టైటాన్, బీపీసీఎల్, ఎల్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.57,980 గా ఉంది. కిలో వెండి రూ.2500 పెరిగి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.730 పెరిగి రూ.26,180 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Shri Praveen Kadle, Chairman, Divgi TorqTransfer Systems Limited along with Shri Girish Joshi, Chief Trading Operations and Listing Sales, BSE and Senior Management from Divgi TorqTransfer Systems Limited pic.twitter.com/jTSrCfBxRM
— BSE India (@BSEIndia) March 14, 2023
Shri Praveen Kadle, Chairman, Divgi TorqTransfer Systems Limited along with Shri Girish Joshi, Chief Trading Operations and Listing Sales, BSE and Senior Management from Divgi TorqTransfer Systems Limited pic.twitter.com/EOvJD51jeF
— BSE India (@BSEIndia) March 14, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Australia Vs India 1st Test Scorecard: పెర్త్ టెస్టులో టీమిండియా బోల్తా - 150 పరుగులకే ఆలౌట్- టాప్ స్కోరర్‌గా నితీశ్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy