Stock Market Closing 14 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం మోస్తరుగా లాభపడ్డాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడంలో కొన్ని రంగాల్లో కొనుగోళ్ల జోష్ కనిపించింది. అమెరికా ఫెడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందోనని మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 52 పాయింట్ల లాభంతో 18,660 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 144 పాయింట్ల లాభంతో 62,677 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 35 పైసలు బలపడి 82.45 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 62,533 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,685 వద్ద మొదలైంది. 62,591 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,835 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 144 పాయింట్ల లాభంతో 62,677 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 18,696 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,671 వద్ద ఓపెనైంది. 18,632 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,696 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 52 పాయింట్ల లాభంతో 18,660 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,078 వద్ద మొదలైంది. 43,987 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,151 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 102 పాయింట్లు ఎగిసి 44,049 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఓఎన్‌జీసీ, యూపీఎల్, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ ఒక శాతానికి పైగా ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.