Largecap Mutual Funds 2022:


ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలనే ఇచ్చాయి. భారత స్టాక్‌ మార్కెట్లు మాత్రం మదుపర్లకు సంపద పంచాయి. మ్యూచువల్‌ ఫండ్ల రాబడీ ఫర్వాలేదు. మరికొన్ని రోజుల్లో 2022 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో అత్యుత్తమంగా ఏవి నిలిచాయి? ఎంత రాబడి అందించాయి? ఆరంభం నుంచి ఇప్పటి వరకు అందించిన ప్రాఫిట్స్‌ ఏంటో చూసేద్దామా!


నిప్పాన్‌ ఇండియా లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌: ప్రస్తుతం ఈ ఫండ్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ ఎన్ఏవీ 61.60గా ఉంది. బీఎస్‌ఈ 100 టోటల్‌ రిటర్న్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఈ ఏడాది 12.91 శాతం రాబడి అందించింది. ఆరంభం నుంచి 15.51 శాతం రిటర్న్‌ ఇచ్చింది.


హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 ఫండ్‌: ఈ ఫండ్ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ప్రస్తుత ఎన్‌ఏవీ 818.49గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 ఫండ్‌ ఈ ఏడాది 12.25 శాతం రాబడి ఇచ్చింది. స్కీమ్‌ మొదలైనప్పటి నుంచి 13.67 శాతం రిటర్న్‌ ఆఫర్‌ చేసింది.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌: ఈ స్కీమ్‌ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ట్రాక్‌ చేస్తుంది. ప్రస్తుత ఎన్‌ఏవీ 76.79. ఈ ఏడాది 8.91 శాతం రిటర్న్‌ ఇచ్చింది. ఇక ఆరంభం నుంచైతే 15.30 శాతం అందించింది.


టారస్‌ లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీ ఫండ్‌: ఈ ఫండ్‌ బీఎస్‌ఈ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్ను ట్రాక్‌ చేస్తుంది. డిసెంబర్‌ 10 నాటికి 117.14 ఎన్‌ఏవీతో ఉంది. ఈ ఏడాది 8.28 శాతం, స్కీమ్‌ ఆరంభం నుంచి 10.17 శాతం రిటర్న్‌ ఇచ్చింది.


బరోడా బీఎన్‌పీ పారిబస్‌ లార్జ్‌ క్యాప్‌: ఈ స్కీమ్‌ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ప్రస్తుత ఎన్‌ఏవీ 166.25. ఇక ఈ ఏడాది రిటర్న్‌ 7.07 శాతం ఉండగా ఆరంభం నుంచి 15.58 శాతం అందించింది.


సుందరం లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌: సుందర్‌ ఫండ్ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఎన్‌ఏవీ 16.36గా ఉంది. ఏడాదిలో 6.97 శాతం, స్కీమ్‌ ఆరంభం నుంచి 26.56 శాతం రిటర్న్‌ ఇచ్చింది.


ఎడిల్‌వీస్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌: ఈ స్కీమ్‌ 2022లో 6.93 శాతం రిటర్న్‌ అందించింది. ఫండ్‌ ఆరంభం నుంచి 14.66 శాతం లాభం ఇచ్చింది. ఈ స్కీమ్‌ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఎన్‌ఏవీ 63.57గా ఉంది.


ఇండియా బుల్స్‌ బ్లూచిప్‌ ఫండ్‌: ఈ స్కీమ్‌ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. ప్రస్తుత ఎన్‌ఏవీ 35.57. ఏడాదిలో 6.56 శాతం, ఫండ్‌ ఆరంభం నుంచి 12.74 శాతం రిటర్న్‌ ఆఫర్‌ చేసింది.


టాటా లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ నిఫ్టీ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. డిసెంబర్‌ 10 నాటికి ఎన్‌ఏవీ 392.68గా ఉంది. ఈ ఏడాది 6.53 శాతం, మొత్తంగా 13.73 శాతం రిటర్న్‌ అందించింది.


ఎస్‌బీఐ బ్లూచిప్‌ ఫండ్‌: ఈ స్కీమ్‌ బీఎస్‌ఈ 100 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది. ప్రస్తుత ఎన్‌ఏవీ 391.85. ఈ ఏడాది 6.05 శాతం, స్కీమ్‌ ఆరంభం నుంచి 14.63 శాతం రాబడి అందించింది.