Stock Market Closing 09 December 2022:  భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని, ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గుతాయన్న భయంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్ల నష్టంతో 18,492 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 389 పాయింట్ల లాభంతో 62,181 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలపడి 82.27 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 946 పాయింట్లు పతనమైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 62,570 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,690 వద్ద మొదలైంది. 61,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,735 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 389 పాయింట్ల నష్టంతో 62,181 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 18,609 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,662 వద్ద ఓపెనైంది. 18,410 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,664 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 117 పాయింట్ల నష్టంతో 18,492 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా లాభపడింది. ఉదయం 43,765 వద్ద మొదలైంది. 43,361 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,361 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 44 పాయింట్లు ఎగిసి 43,641 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు భారీగా పతనమయ్యాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.