Stock Market Closing 08 December 2022:


భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టడంతో ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. ఐరోపా మార్కెట్లు తెరిచిన వెంటనే సూచీల మూమెంటమ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 48 పాయింట్ల లాభంతో 18,609 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 160 పాయింట్ల లాభంతో 62,570 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 82.43 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు విపరీతమైన గిరాకీ ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 62,410 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,504 వద్ద మొదలైంది. 62,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,633 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 160 పాయింట్ల లాభంతో 62,570 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 18,560 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,570 వద్ద ఓపెనైంది. 18,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 48 పాయింట్ల లాభంతో 18,609 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీగా లాభపడింది. ఉదయం 43,142 వద్ద మొదలైంది. 43,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,640 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 498 పాయింట్లు ఎగిసి 43,596 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, ఎల్‌టీ, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. సన్‌ఫార్మా, దివిస్‌ ల్యాబ్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు గ్రీన్‌లో మెరిశాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.