Tax Saving Mutual Funds 2022:


ఒకే ఆదాయ వనరుతో సంపద సృష్టించడం ఎవరికైనా అసాధ్యమే! అందుకే చాలామంది స్టాక్‌ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌, పీపీఎఫ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. మార్కెట్‌పై అవగాహన ఉంటే ఫర్వాలేదు! కనీస పరిజ్ఞానం లేకుండా ఇన్వెస్ట్‌ చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి వారికి మ్యూచువల్‌ ఫండ్లు బెస్ట్‌! క్రమశిక్షణ, తక్కువ రిస్క్‌తోనే బాగా డబ్బు సంపాదించొచ్చు. పైగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి స్కీమ్‌లు పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. 2022లో బాగా పెర్ఫామ్‌ చేసిన టాప్‌ 10 ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్లు ఏవంటే?


పరాగ్‌ పారిఖ్‌ టాక్స్‌ సేవర్‌ ఫండ్‌: ఆరంభం నుంచి ఇప్పటి వరకు అత్యధిక రాబడి ఇచ్చిన ఫండ్‌ ఇది. డైరెక్ట్‌ స్కీమ్‌ 24.91 శాతం రిటర్న్‌ ఇవ్వగా రెగ్యులర్‌ ఫండ్‌ 23.34 శాతం రాబడి అందించింది. ఇదే సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్ 18.98 శాతం లాభం ఇవ్వడం గమనార్హం.


క్వాంట్‌ టాక్స్‌ ప్లాన్‌: ఈ ఫండ్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ 21.87 శాతం వార్షిక రిటర్న్‌ అందించింది. ఇక రెగ్యులర్‌ ఫండ్‌ 15.35 శాతం ఇచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఏవీ 278.50గా ఉంది. రోజువారీ ఏయూఎం రూ.2374 కోట్లు.


మిరే అసెట్‌ టాక్స్‌ సేవర్ ఫండ్‌: స్కీమ్‌ మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చక్కని రాబడి ఇచ్చింది. డైరెక్ట్‌ స్కీమ్‌ 20.01%, రెగ్యులర్‌ స్కీమ్‌ 18.34 శాతం రిటర్న్ అందించాయి. ఎన్‌ఏవీ విలువ రూ.35.52గా ఉంది.


ఐడీఎఫ్‌సీ టాక్స్‌ అడ్వాండేట్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్‌: ఈ స్కీమ్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు 17.95 శాతం రిటర్న్‌ ఇచ్చింది. ఇక రెగ్యులర్‌ స్కీమ్ 18.23 శాతం రాబడి అందించింది. నెట్‌ అసెట్స్‌ వాల్యూ 115.41గా ఉంది.


ఐడీబీఐ ఈక్విటీ అడ్వాంటేజ్‌ ఫండ్‌: ప్రస్తుతం ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ 45.01గా ఉంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్‌ బెంచ్‌మార్క్‌ 16 శాతం రిటర్న్‌ ఇవ్వగా డైరెక్ట్‌ స్కీమ్‌ 17.67 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 16.28 శాతం ఇచ్చాయి.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాక్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌: ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ ఫండ్ డైరెక్ట్‌ స్కీమ్‌ 17.57 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 18.48 శాతం రిటర్న్‌ ఇచ్చాయి. ప్రస్తుత ఎన్‌ఏవీ 117.29 గా ఉంది.


యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌: ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ 74.21గా ఉంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్‌ స్కీమ్ 17.44 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 15.83 శాతం రిటర్న్‌ అందించాయి. డైలీ ఏయూఎం ఏకంగా రూ.31,623 కోట్లు కావడం గమనార్హం.


టాటా ఇండియా టాక్స్‌ సేవింగ్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌ వార్షికంగా 13.92 శాతం రిటర్న్‌ ఇచ్చింది. ఇక డైరెక్ట్‌ స్కీమ్‌ 17.26, రెగ్యులర్‌ స్కీమ్‌ 18.58 శాతం రిటర్న్‌ అందించాయి. ప్రస్తుత ఎన్‌ఏవీ 161.13గా ఉంది.


డీఎస్‌పీ టాక్స్‌ సేవర్ ఫండ్‌: ఈ ఫండ్‌ ఎన్‌ఏవీ 92.71గా ఉంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్‌ స్కీమ్‌ 17.16 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 14.46 శాతం రిటర్న్‌ అందించాయి. ఇక బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 11.44 శాతం రిటర్న్‌ ఇవ్వడం గమనార్హం.


ఇన్వెస్కో ఇండియా టాక్స్‌ ప్లాన్‌ ఫండ్‌: ఈ స్కీమ్‌ బెంచ్‌ మార్క్‌ రిటర్న్‌ 11.80 శాతంగా ఉంది. ఆరంభం నుంచి చూస్తే డైరెక్ట్‌ స్కీమ్ 16.77 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 13.97 శాతం రిటర్న్‌ అందించాయి. ప్రస్తుత ఎన్ఏవీ 92.39.


నోట్‌: ఈ సమాచారం, గణాంకాలు డిసెంబర్‌ 8, 2022 నాటివి. ఏఎంఎఫ్ఐ లేదా అసోసియేషన్‌ ఆఫ్ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా ఆధారంగా సమాచారం అందిస్తున్నాం.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.