Stock Market Closing 11 November 2022: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో స్థానిక మార్కెట్లలో బుల్‌ రంకెలు వేసింది. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు గతం కన్నా మెరుగ్గా ఉండటం, బాండ్‌ యీల్డులు తగ్గడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6 లక్షల కోట్ల మేర ఆర్జించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 321 పాయింట్ల లాభంతో 18,349 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1181 పాయింట్ల లాభంతో 61,795 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 100 పైసలు లాభపడి 80.81 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 60,613 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,311 వద్ద మొదలైంది. 61,311 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,840 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1181 పాయింట్ల లాభంతో 61,795 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 18,028 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,272 వద్ద ఓపెనైంది. 18,259 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,362 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 321 పాయింట్ల లాభంతో 18,349 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 42,163 వద్ద మొదలైంది. 41,918 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,345 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 533 పాయింట్ల లాభంతో 42,137 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. ఐచర్‌ మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్‌బీఐ, బ్రిటానియా, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.