Stock Market Closing 10 November 2022: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగెటివ్‌ సంకేతాలు వచ్చాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 128 పాయింట్ల నష్టంతో 18,028 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 419 పాయింట్ల నష్టంతో 60,613 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 38 పైసలు నష్టపోయి 81.81 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 61,033 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,524 వద్ద మొదలైంది. 60,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,848 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 419 పాయింట్ల నష్టంతో 60,613 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 18,157 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,044 వద్ద ఓపెనైంది. 17,969 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,103 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 128 పాయింట్ల నష్టంతో 18,028 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 41,462 వద్ద మొదలైంది. 41,318 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,318 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 179 పాయింట్ల నష్టంతో 41,603 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఒక శాతానికి పైగా పడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.