search
×

Stock Market Today: పండగ చేసుకున్న రూపాయి - రెడ్‌ జోన్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

Stock Market Closing 10 January 2023: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 17,914 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing 10 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం వంటివి మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 17,914 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 631 పాయింట్ల నష్టంతో 60,115 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 58 పైసలు లాభపడి 81.78 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 60,747 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,805 వద్ద మొదలైంది. 59,938 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,809 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 631 పాయింట్ల నష్టంతో 60,115 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 18,101 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,121 వద్ద ఓపెనైంది. 17,856 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,127 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 187 పాయింట్ల నష్టంతో 17,914 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 42,642 వద్ద మొదలైంది. 41,835 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,674 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 568 పాయింట్లు తగ్గి 42,014 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌, హిందాల్కో, పవర్‌ గ్రిడ్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, భారతీ ఎయిర్టెల్‌, ఐచర్‌ మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. ఆటో, హెల్త్‌కేర్‌ మినహా అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ రంగాల సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 10 Jan 2023 03:52 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

Mutual Funds: మోదీ 3.0 హయాంలో లాభపడే బెస్ట్‌ ఫండ్స్‌ - మీ ఇంట కనకవర్షం కురవొచ్చు!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

SIP Calculator: రూ.25,000 జీతం ఉన్నా రూ.15 కోట్లు కూడబెట్టొచ్చు - పక్కా లెక్క ఇదిగో!

టాప్ స్టోరీస్

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!

Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!

Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!

Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్