Stock Market Closing 08 August 2023:


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. చైనా ట్రేడ్‌, ఇన్‌ప్లేషన్ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రభుత్వం రంగ బ్యాంకులు మాత్రం దుమ్మురేపాయి. చివరికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 26 పాయింట్లు తగ్గి 19,570 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 106 పాయింట్లు తగ్గి 65,846 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీన పడి 82.84 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,953 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,048 వద్ద మొదలైంది. 65,752 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,057 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 106 పాయింట్ల నష్టంతో 65,846 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 19,597 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,627 వద్ద ఓపెనైంది. 19,533 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,634 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 26 పాయింట్లు తగ్గి 19,570 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,052 వద్ద మొదలైంది. 44,817 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 126 పాయింట్లు పెరిగి 44,964 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్‌, హీరో మోటో కార్ప్‌, సిప్లా, టెక్‌ మహీంద్రా, విప్రో షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, హిందాల్కో, ఎం అండ్‌ ఎం, దివిస్‌ ల్యాబ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నస్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఫైనాన్స్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,060 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.74000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.24,380 వద్ద ఉంది.


Also Read: మూడీస్‌ షాక్‌! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్‌ - పైగా వార్నింగులు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.