By: Rama Krishna Paladi | Updated at : 07 Sep 2023 03:53 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 07 September 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం అదరగొట్టాయి. వరుసగా ఐదో సెషన్ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకున్న సూచీలు ఆఖర్లో బలంగా పుంజుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 116 పాయింట్లు పెరిగి 19,727 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 385 పాయింట్లు పెరిగి 66,265 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసల బలహీనపడి 83.21 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,880 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,854 వద్ద మొదలైంది. 65,672 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,296 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 385 పాయింట్ల లాభంతో 66,265 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,611 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,598 వద్ద ఓపెనైంది. 19,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,737 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 116 పాయింట్లు పెరిగి 19,727 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,418 వద్ద మొదలైంది. 44,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,915 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 469 పాయింట్లు ఎగిసి 44,878 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. కోల్ ఇండియా (6.92%), ఎల్‌టీ (4.24%), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.08%), ఎస్బీఐ లైఫ్ (1.80%), ఎస్బీఐ (1.77%) షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్ (2.27%), ఓఎన్జీసీ (0.98%), బ్రిటానియా (0.90%), ఎం అండ్ ఎం (0.77%), సన్‌ఫార్మా (0.732%) షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.59,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,350 వద్ద ఉంది.
నిన్న ఏం జరిగిందంటే?
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం రోజువారీ కనిష్ఠాల్లోకి జారుకున్నాయి. ఆఖరి అరగంటలో అనూహ్యంగా పుంజుకొని నష్టాలను పూడ్చుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్లు పెరిగి 19,611 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 100 పాయింట్లు పెరిగి 65,880 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడింది.
Also Read: జీ20 సమ్మిట్‌లో పాల్గొనే అందరికీ తలో వెయ్యి రూపాయలు, గవర్నమెంట్ ప్లాన్ భళా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ